రాయలసీమ నుండి రాష్ట్ర స్థాయి వరకు — ప్రతి కథ వెనుక ఒక సంస్కృతి, ప్రతి ఫ్రేమ్ వెనుక ఒక బాధ్యత.
రాయలసీమ ప్రాంతీయ సంస్కృతి మరియు భక్తి సంప్రదాయాలను ప్రతిబింబించే విజయవంతమైన డాక్యుమెంటరీ. స్థానిక భావోద్వేగాలను సహజంగా తెరపైకి తీసుకువచ్చిన ప్రాజెక్ట్.
జమ్మలమడుగు ప్రాంత చరిత్ర, ఆధ్యాత్మికత, ఈ ఊరి మనుషుల నమ్మకాలు, చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలను కళ్ళకు కట్టినట్టు చూపే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.
టైటిల్ సాంగ్‌కు ప్రజల విశేష ఆదరణ — వినండి
కడప జిల్లా చరిత్ర, వారసత్వం, కళలు మరియు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రత్యేక ప్రయత్నం.
రాయలసీమ అంతటా జరుపుకునే మొహర్రం పండుగపై డాక్యుమెంటరీ — హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ కలిసి జరుపుకునే అరుదైన పండుగ, ఈ ప్రాంతపు ఉమ్మడి విశ్వాసం మరియు సామరస్యానికి ప్రతీక.
ట్రైలర్ చూడండి“జమ్మలమడుగు జాతర” డాక్యుమెంటరీలోని టైటిల్ సాంగ్ ప్రజల నుండి విశేష ఆదరణ పొందింది. ఈ విజయం జిల్లా పరిపాలన దృష్టిని ఆకర్షించి, ప్రభుత్వ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశాన్ని కల్పించింది. స్వయంగా కలెక్టర్ గారు మా ప్రతిభను మెచ్చుకొని ఉంచిన విశ్వాసం, మా బాధ్యతను మరింత పెంచింది.

ప్రభుత్వ పాఠశాలల గొప్పతనం, పనితీరు, ఫలితాలు మరియు విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతిబింబించిన ప్రాజెక్ట్.

కరువు, కష్టాల మధ్య కూడా అద్భుతాలు సృష్టిస్తున్న కడప రైతుల శ్రమ, ఆత్మవిశ్వాసం, వ్యవసాయ గొప్పతనాన్ని చాటిన గౌరవ గీతం.